కేరళలో మైనర్​ బాలికపై 62 మంది లైంగిక దాడి!

14మందికి జ్యూడీషియల్​ కస్టడీ

Jan 12, 2025 - 14:49
 0
కేరళలో మైనర్​ బాలికపై 62 మంది లైంగిక దాడి!

సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్​ సీ డబ్ల్యూ

తిరువనంతపురం: కేరళలో మైనర్​ బాలిక (13)పై 62 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. 14 మంది నిందితులను పోలీసులు జ్యూడీషియల్​ కస్టడీకి పంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆదివారం వెలుగులోకొచ్చిన ఈ లైంగిక దాడిపై పతనంతిట్ట జిల్లాలోని రెండు పోలీస్​ స్టేషన్లలో తొమ్మిది ఎఫ్​ ఐఆర్​ లు నమోదయ్యాయి. బాలిక స్పోర్ట్స్ కోచ్‌లు, తోటి అథ్లెట్లు, క్లాస్‌మేట్స్ లైంగికదాడులకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (నేషనల్​ వ్యూమన్​ కమిషన్​) మూడు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కేరళ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పి. సతీదేవి సుమోటోగా కేసు నమోదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బాలిక ఈ విషయాలు చెప్పినట్లు ఎన్​ సీ డబ్ల్యూ గుర్తించింది. బాలికపై లైంగిక దాడిలో ఇరుగు పొరుగు కూడా ఉన్నట్లు ధృవీకరించారు. లైంగిక దాడికి పాల్పడడమే గాకుండా బాలికకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఈ విషయం వెలుగులొకొచ్చింది. ఈ లైంగిక దాడిపట్ల కేరళ పినరయి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.