రాళ్లు రువ్వినవారికి ప్రభుత్వోద్యోగాల్లేవ్​

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

May 27, 2024 - 13:55
 0
రాళ్లు రువ్వినవారికి ప్రభుత్వోద్యోగాల్లేవ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాళ్లు రువ్విన, ఉగ్రవాదులుగా ముద్రపడ్డ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని అమిత్​ షా హెచ్చరించారు. జమ్మూకశ్మీర్​ లో ఉగ్రవాద ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా సోమవారం మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులను టార్గెట్ చేయడమే కాకుండా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూడా నిర్మూలించిందని షా పేర్కొన్నారు. దీని వల్ల దేశంలో ఉగ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని అమిత్ షా అన్నారు. ఎవరైనా ఏదైనా ఉగ్రవాద సంస్థలో చేరితే వారి కుటుంబ సభ్యులకు కూడా నష్టమే అని తెలుసుకోవాలన్నారు. 

ఉగ్రవాదులు మరణిస్తే హ్యూమన్​ రైట్స్​ సుప్రీంకు వెళ్లినా సుప్రీంలో ప్రభుత్వమే గెలిచిందని షా గుర్తు చేశారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తన కుటుంబంలోని వ్యక్తి ఉగ్రవాద సంస్థలు చేరినట్లుగా తెలియగానే ప్రభుత్వానికి తెలియజేస్తే వారికి మాత్రం మినహాయింపు ఇస్తుందన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలు భారత్​ లో పూర్తిగా నిలిపివేశామన్నారు. 

భారత్​ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం అందజేస్తున్న వారిపై ఎన్​ ఐఏ చర్యలు తీసుకుంటుందన్నారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం నిలిపివేయడం అంటే వెన్నువిరవడమే అన్నారు.