రూ. 5 లక్షలతో శునకం బర్త్ డే!
Rs. Shunakam's birthday with 5 lakhs!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ‘కనకపు సింహాసమున శునకమును కూర్చుండబెట్టిన’ అనే పద్యాన్ని విన్నారా? వినే ఉంటారు. ఈ వార్తను చదివితే నిజమా? అని నోరెళ్లబెట్టక మానరు. ఓ మహిళా తన శునకానికి ఏకంగా 300మంది అతిథులను పిలిచి రూ. 40వేల కేక్, డీజే, లైవ్ మ్యూజిక్ రూ. 5 లక్షలు వెచ్చించి మరీ పుట్టినరోజును ఘనంగా జరిపింది. ఈ ఘటన కాస్త ఆ మాధ్యమంలో.. ఈ మాధ్యమంలో పడి సామాజిక మాధ్యమంలో వెలుగు చూసింది. దీంతో నెటీజన్లు ఔరా ముద్దుగా.. బొద్దుగా ఉన్న ఈ అమ్మడు కుక్క కూడా ముద్దుగా.. బొద్దుగా ఉండడాన్ని చూసి నీది పె..ద్ద మనస్సే అని అంగీకరిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. కుక్క కేక్ తిందో లేదో తెలియదు గానీ.. అతిథులు మాత్రం కేక్ ను పూర్తిగా తినేసి.. అరిగేదాకా డ్యాన్సులు చేశారట! ఈ ముద్దుగుమ్మ పేరు స్వప్నా. ఝార్ఖండ్ జంషెడ్ పూర్ నివాసి. తన ముద్దుల శునకం ఆరేళ్ల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నానని మెలికలు తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చిందీ అమ్మడు. అన్నట్లు ఈ అమ్మడు (స్వప్నా)ను తక్కువ అంచనా వేయకండి. ఈమె సామాజిక సేవలో ఆ ప్రాంతంలో నెంబర్ 1. తామున్న ప్రాంతంలో రూ. 1.52 లక్షలతో సోలార్ వీధి దీపాలు, కమ్యూనిటీ సెంటర్ కు రూ. 30వేలు, ఇలా కుక్క పుట్టినరోజు ప్రతీయేటా వేడుకల్లో సామాజిక కార్యక్రమాల ద్వారా సేవ కూడా చేస్తుంది. ఏది ఏమైనా ఈ అమ్మడు శునకం గ్రేటే కదా! దీనికంటే ఈ అమ్మడుకు జంతువులు, సామాజిక సేవ పట్ల ఉన్న అభిప్రాయం కూడా గ్రేటే మరీ!