ప్రజాసమస్యలు గాలికొదిలేస్తారా?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి 

Nov 18, 2024 - 14:15
 0
ప్రజాసమస్యలు గాలికొదిలేస్తారా?
రాజకీయాలను అపహాస్యం చేస్తారా?
వ్యక్తిగత దూషణలే ఎజెండాలా?
అప్పుల రాష్​ర్టంగా మార్చారు
నా తెలంగాణ, హైదరాబాద్​: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఇరు పార్టీలు తెలంగాణ రాజకీయాలను అపహాస్యం చేస్తున్న తీరు, రాష్ర్ట పేరు, ప్రఖ్యాతులను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను పూర్తి అప్పుల రాష్ట్రగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలే ఎజెండాలుగా తీసుకోకుండా వ్యక్తిగత దూషణలే ఎజెండాగా వీరి పరిపాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. బీజేపీ సభ్యత్వ సేకరణలో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి సోమవారం వేదాంత కన్వెన్షన్​ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 
 
గాలిమాటలను ఇక ప్రజలు నమ్మరు..
తెలంగాణలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ ను కాదని కాంగ్రెస్​ గాలిమాటలు నమ్మి ఓటేసి మోసపోయారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్​ పాలనతో విస్తుపోతున్నారన్నారు. సమస్యల మీద ఏ మాత్రం చర్చలు జరపకుండా వ్యక్తిగత చర్చలకే ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ పాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ రాష్​ర్ట రాజకీయాలను కేసీఆర్​, రేవంత్​ లు పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. తెలంగాణ సమాజం ఇంత దిగజారిన రాజకీయాలను చూడలేదన్నారు. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు వీరు మాట్లాడుతున్న మాటలు, భాష రాజకీయాలను అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు ఏ మాత్రం బాధ్యత లేకుండా రాజకీయాలను కలుషితం చేస్తున్నాయన్నారు. 
 
మహారాష్​ర్ట పత్రికల్లో అబద్ధపు ప్రకటనలా?..
తెలంగాణ ప్రజాపాలన గాలికి వదిలి గ్యారంటీలు, హామీలు అమలు చేయకుండా మహారాష్​ర్ట ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్​ వెళ్లడం సిగ్గుచేటన్నారు. అక్కడి పత్రికల్లో తొలిపేజీలో తెలంగాణ కాంగ్రెస్​ పేరుతో ప్రకటనలిస్తున్నారని అన్నారు. ఇంతకంటే అసత్యాలు ఇంకొకటి ఉండవన్నారు. కాంగ్రెస్​ అంటేనే అబద్ధాల పార్టీ అని కిషన్​ రెడ్డి విమర్శించారు. తాను ఏ ఒక్కరికీ గులాంను కాదని భారతీయులకు మాత్రమే గులామన్నారు. మీరు ఇటలీకి గులామన్నారు. ఖచ్చితంగా స్వాతంత్ర్య పోరాటంలో సర్ధార్​ పాత్రకు గులామన్నారు. దేశ దారిద్ర్యరేఖ ప్రజలను దిగువకు తీసుకువచ్చిన మోదీ గుజరాత్​ కు తాను గులామునే అన్నారు. తాను సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటన్నారు. మీ వైఫల్యాలు, హామీలు, అవినీతి, భూదందాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడులు చేసే అలవాటు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లకు అలవాటైందన్నారు. ఈ రెండు పార్టీలు సమస్యల నుంచి పూర్తిగా తప్పించుకుంటే ప్రశ్నించే వారిపై బుదరజల్లుతున్నాయన్నారు. 
 
నిర్మాణాత్మక రాజకీయాలనే ప్రజలు నమ్ముతారు..
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులన్నారు. ఎక్కువ రోజులు ప్రజలను ఎవ్వరూ మోసం చేయలేరన్నారు. ఖచ్చితంగా నిర్మాణాత్మక రాజకీయాలనే దేశ ప్రజలు ఆశీర్వదించి అండగా ఉంటారని మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మన రాష్ర్టంలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు ఏ రాష్​ర్టంలో లేవన్నారు. 1.50 వేల కోట్లు మూసీ ప్రక్షాళనకు ఎవరు ఇస్తారు? నోట్లు ముద్రించే మిషన్లు ఏమైనా పెట్టుకున్నారా? అని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి నిలదీశారు. తెలంగాణ సమాజాన్ని బీఆర్​ఎస్​ తాకట్టు పెట్టిందన్నారు. 10 రూపాయలు ఇచ్చి, 20 రూపాయల అప్పుతెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ తామేమి తక్కువ తినలేదన్నట్లు అప్పుకోసమే ఓ టాస్క్​ ఫోర్స్​ ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్​ కాపాడుకునే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు. తెలంగాణ భవిష్యత్​ ను సువర్ణాక్షరాలతో నిర్మించుకునే బాధ్యత బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ సమాజం, ప్రజలు బీజేపీతో కలిసి నడిసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణను మద్యం, ఏటీఎం రాష్ర్టంగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ కాంట్రాక్టు, టెండర్​ వేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. అందుకే కుటుంబ సభ్యుల పేరుతో టెండర్లు వేయించుకుంటున్నారని అన్నారు. నిజంగా నిర్మాణాత్మకంగా పనిచేసే కాంట్రాక్టర్లు తెలంగాణతో పనిచేసేందుకు సిద్ధంగా లేదన్నారు. మెట్రో వాటర్​ వర్క్​ లో రూ. 10 లక్షల టెండర్​ కు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే రాష్​ర్ట ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలన్నారు. 
 
ఎవరి భవిష్యత్​ అంధకారంలో పెట్టాలనుకుంటున్నారు?..
కిసాన్​ నిధులు, ఉచిత రేషన్​, పీఎం రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయితీలకు నిధులు, రైల్వే అభివృద్ధి, బస్తీ దవాఖానాలకు నిధులు ఇలా అనేక నిధులను బీజేపీ ప్రభుత్వమే ఇస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ లు ఆర్థికంగా దివాలా తీశాయన్నారు. ఇక్కడి రెవెన్యూ అప్పులు కట్టేందుకే సరిపోతుందన్నారు. ఎవరి భవిష్యత్​ అంధకారంలో పెట్టాలని అనుకుంటున్నారో బీజేపీ కార్యకర్తలు ఆలోచించి కింది స్థాయిలో కార్యచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లి ప్రజకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని తద్వారా బీజేపీని మరింత పటిష్ఠం చేయాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.