దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బీజేపీ కారణం
కుటుంబ పార్టీ కాంగ్రెస్
అన్నివర్గాల వారికీ సమప్రాధాన్యతనిచ్చే పార్టీ బీజేపీ
చరిష్మా ఉన్న నాయకుల్లో మొదటివరుసలో ప్రధాని మోదీ
ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి. శివశంకరన్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్–బీజేపీ మధ్య విధానపరమైన, ఉదారవాద, లౌకిక, జాతీయ వాద, సామాజిక, హక్కులు, ఆర్థిక విధానాలు వంటి చాలా అంశాల్లో తేడాలున్నాయని ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి. శివశంకరన్ అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లౌకిక వాద పార్టీ అన్నారు. అదే సమయంలో బీజేపీ జాతీయవాద మితవాద పార్టీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, ఆర్థిక విధానాలలో జోక్యం చేసుకుంటుందన్నారు. దీనివల్ల ఆర్థిక అసమతుల్యత ఏర్పడుతుందన్నారు. అదే బీజేపీ ఆర్థిక విధానాలు, సామాజిక సంక్షేమంలో స్వేచ్ఛా వాణిజ్యం, వ్యాపారాలకు ఆస్కారం ఇస్తుందన్నారు. దీనివల్ల దేశంలోని మార్కెట్ విధానాలు సులభతరం అవుతూ ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడతాయన్నారు. దేశంలో పెట్టుబడులకు, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బీజేపీ విధానాలు కారణమవుతున్నాయని తెలిపారు.
మైనార్టీ హక్కులపై కాంగ్రెస్ ఉదారవాద ధోరణిని ప్రదర్శిస్తుందన్నారు. దీని వల్ల పలుమార్లు కష్టనష్టాలు కూడా తప్పలేదన్నారు. అదే సమయంలో బీజేపీ అభిప్రాయాలు, సాంప్రదాయాలు, సామాజిక విధానాలతో అందరికీ ఒకే విధానం ధోరణితో ముందుకు వెళుతుందన్నారు. ఈ విధానం వల్ల దేశ సంక్షేమం వంద శాతం సాధ్యపడుతుందని శివశంకరన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీ కుటుంబానికే నాయకత్వం వహిస్తుండగా, బీజేపీలో పనిచేసిన వారికి దేశ సంక్షేమాన్ని కాంక్షించిన అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఈ వరుసలో బీజేపీలో ఎంతోమందిప్రముఖులుండగా తొలి వరుసలో ఉన్నది మాత్రం ప్రధాని నరేంద్ర మోదీనే అని తెలిపారు.