ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుందాం
Let MLC candidates win
పీఆర్టీయూటీఎస్ ప్రత్యేక పూజలు
క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
నా తెలంగాణ, మొయినాబాద్: త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి (వరంగల్), మహేందర్ రెడ్డి (కరీంనగర్) గెలుపొందాలని పీఆర్ టీయూటీఎస్ సంఘం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని గెలిపించుకోవడం వల్ల పెండింగ్ బిల్లులు, సీపీఎస్, హెల్త్ కార్డుల లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు.
గురువారం మొయినాబాద్ మండల పరిధిలోని జడ్పీహెచ్ ఎస్ కనకమామిడి పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు బందయ్య, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అధ్యక్షులు హమీద్ ల ఆధ్వర్యంలో క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డిలు ఎంఈవో వెంకటయ్యకు డైరీ, క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీరి గెలుపు ద్వారా మండల పరిధిలోని ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంజనేయులు, వెంకటయ్య, రాములు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు సత్యనారాయణ రెడ్డి, నరేందర్, శివకుమార్, శేఖర్ రెడ్డి, అరుణ్ కుమార్, వేణు, ఇ. రాములు, బీమ్లా నాయక్, వెంకటరెడ్డి, మల్లారెడ్డి, జంగయ్య, వినోద్, శ్రీనివాసులు, రాములు నాయక్, రఘురాములు, వేణు, విక్రమ్, కవితారాణి, అతిథులు శివరాం నాయక్, బలరాంలు పాల్గొన్నారు.