మేళా నిర్వహణ ఒక శాతం పెరగనున్న జీడీపీ!
ఉనికిని చాటుకునేందుకు విదేశీ సంస్థల క్యూ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహాకుంభ్ మేళా సోమవారం ప్రారంభం కానుంది. గంగా, యమునా, సరస్వతి పవిత్ర సంగమంలో అశేష సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం కానుంది. 40 కోట్ల మంది సగటు ఒక్కొక్కరి ఖర్చు రూ. 5వేలకు పెట్టుకున్నా ఏకంగా రూ. 2 లక్షల కోట్లు ఈ మేళా నిర్వహణ ద్వారానే రాబడి సమకూరనుంది. దీంతో జీడీపీ ఏకంగా 1 శాతానికి పైగా ఎగబాకనుంది. అయితే ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఒక్కొక్కరి ఖర్చు రూ. 10వేలుగా ఉంది. అంటే ఈ మేళా నిర్వహణ ద్వారా రూ. 4 లక్షల కోట్లు సమకూరనుంది. 45 రోజులపాటు జరిగే ఈ మేళాలో తమ ఉనికిని చాటుకునేందుకు విదేశీ సంస్థలు సైతం పోటీ పడటం గమనార్హం. కానీ భారత్ మాత్రం అత్యధిక ప్రాధాన్యత హిందువులకే ఇస్తోంది.
ఫార్మాస్యూటికల్స్, డిజిటల్, మార్కెటింగ్ తదితర రంగాలు పోటీలో నిలుస్తున్నాయి. డిజిటల్ పేమెంట్లు అత్యధికంగా జరగనున్న నేపథ్యంలో ఆయా ఫ్లాట్ ఫామ్ లు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే కుంభమేళాలో తమ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. కుంభమేళాలో వివిధ నిర్మాణాలకు గానూ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ 45వేళ టన్నుల స్టీల్ ను సరఫరా చేసింది. దీంతో చెకర్డ్ ప్లేట్లు, హాట్ స్ట్రిప్ మిల్ ప్లేట్లు, మైల్డ్ స్టీల్ ప్లేట్లు, యాంగిల్స్, జోయిస్ట్‌లు ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. 200 రోడ్ల నిర్మాణం, 12 బ్రిజిలు, 3 లక్షల మొక్కలతో ఉద్యానవన నిర్మాణం వంటివి చేశారు. అడుగడుగునా రహదారులపై అందమైన పూల మొక్కలు దర్శనం ఇవ్వనున్నాయి.