సింగరేణి ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం
Singareni vacant lots are exotic
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి ఆస్థులైన ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. పట్టణంలోని సింగరేణి ఖాళీ స్థలాన్ని ఓ ట్రాక్టర్, లారీల యజమాని ఆక్రమించాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని జయశంకర్ చౌరస్తాను ఆనుకొని ఉండే సింగరేణి ఖాళీ స్థలంలో కాలువ ఉండగా భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వాటర్స్ నుంచి వచ్చే మురుగు అందులోని చేరుతుంది. ఆ ఖాళీ, కాలువ స్థలాన్ని ఓ ట్రాక్టర్, లారీల యజమాని ఏర్పాటు చేసిన సింగరేణి కంచెను తొలగించి మట్టితో నింపి అందులో ట్రాక్టర్ల ను నిలుపుతూ కబ్జాకు గురి చేస్తున్నాడు. గమనించిన సింగరేణి ఎస్టేట్, ఎస్ అండ్ పీసీ సిబ్బంది ఆ యజమానిని నిలదీయగా 22వ వార్డు కౌన్సిలర్ భర్త చెబితేనే ఆ స్థలంలో మట్టిని నింపినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, వారి బంధువులు సింగరేణి స్థలాల ఆక్రమణలకు తెర లేపడంపై పలువురు స్థానికులు మండిపడుతున్నారు.