ఏచూరి కన్నుమూత!
Yechuri passed away!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19న న్యూఢిల్లీలోని ఐయిమ్స్‌లో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఆపై ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) నేత హన్నన్ మొల్లా గురువారం మీడియాకు తెలిపారు. సీతారాం ఏచూరి గత 32 సంవత్సరాల నుంచి సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరోగా ఉన్నారు. 2015 నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన మృతితో పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.