ఓటర్ల జాబితా విడుదల మహిళా ఓటర్లే అధికం

Release of voter list has majority of female voters

Sep 28, 2024 - 20:43
 0
ఓటర్ల జాబితా విడుదల మహిళా ఓటర్లే అధికం

నా తెలంగాణ, నిర్మల్: త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న ఓటర్ల జాబితాను శనివారం సాయంత్రం విడుదల చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 400 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిలో 3368 వార్డులు ఉన్నాయి. అత్యధిక పంచాయితీలు కుబీర్ లో 42, 344 వార్డులున్నాయి. అత్యల్ప పంచాయితీలు బాసర మండలంలో 10 ఉన్నాయి. ఇందులో 90 వార్డులున్నాయి. బాసరలో మొత్తం ఓటర్లు 15,384 కాగా వీరిలో 7,427 పురుషులు, 7,956 మంది మహిళలు ఉన్నారు. కుబీర్ లో అత్యధికంగా 39,791 ఓటర్లున్నారు. కాగా జిల్లాలో ఓటర్ల సంఖ్యను బట్టి చూస్తే పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 4,40,651 ఓటర్లకు గాను పురుషులు 2,09,994 కాగా మహిళలు 2,30,641 ఓటర్లున్నారు. అంటే మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 20,647 అధికంగా ఉంది.