కిషన్ రెడ్డి చొరవతో సర్కారు బడుల్లో వెలుగులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో జీవం పోశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో జీవం పోశారు. మోదీ ప్రభుత్వం సంకల్పానికి అనుగుణంగా నరేంద్ర మోదీ స్ఫూర్తిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల భవనాలన్నీ సరికొత్తగా రూపుదిద్దుకునేలా కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించారు. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, అదనపు గదులు నిర్మించారు. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలతోపాటు నోటుబుక్కులను కూడా అందజేశారు. దాదాపుగా 7 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబులు.. 23 ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లకు 1200 కి పైగా టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు సమకూర్చారు. అటల్ టింకరింగ్ ల్యాబులను ఏర్పాటు చేయడంతో పాటు 50 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతిగదులు ఏర్పాటు చేశారు. దీంతో వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్కారు బడుల మూసివేతతో నష్టపోయాం.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఉన్నత విద్యకు నోచుకోలేకపోతున్నామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీతోనే విద్యారంగంలో గుణాత్మకమైన మార్పులు వస్తాయని అభిప్రాయం చాలామందిలో ఉంది.
-త్రిశూల్