మాస్ మహరాజ్ ‘మల్టీ’ప్లాన్ అదుర్స్
మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్‌లో మాస్ మహరాజ్ రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్‌లో మాస్ మహరాజ్ రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్న రవితేజ హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఆయన పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.ఏషియన్ రవితేజ (ఏ ఆర్ టీ)పేరుతో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్ కాబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు (ఏఎంబీ), అల్లు అర్జున్ (ఏఏఏ), విజయ్ దేవరకొండ (ఏవీడీ) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్ గ్రూప్స్ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ చేరిపోయాడు