డైరెక్ట్ మూవీలో ‘కింగ్’ఖాన్ కూతురు
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ 'ది ఆర్చీస్'తో నటిగా పరిచయమైంది. జోయా అక్తర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ 'ది ఆర్చీస్'తో నటిగా పరిచయమైంది. జోయా అక్తర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. అయితే ది ఆర్చీస్ అనేది కేవలం వెబ్ సిరీస్ మాత్రమే. ఇప్పుడు స్ట్రెయిట్ గా ఒక సినిమాతో సుహానా తన లక్ చెక్ చేసుకోనుంది. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కానుంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటించనున్న 'కింగ్' చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.తాజా సమాచారం మేరకు.. సుహానా ఖాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. పొడవాటి నెరిసిన జుట్టుతో, తన పాత్రకు మరింత డెప్త్ తో డాన్ క్యారెక్టర్‌లో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్ర గ్రే షేడ్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఫాహిమ్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్, గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2024లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నిజానికి డాన్ 3లో షారూఖ్ నటిస్తారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తన ఫ్రాంఛైజీ కొత్త సినిమాలో రణ్ వీర్ సింగ్ డాన్ పాత్రలో నటిస్తాడని ప్రకటించారు. డాన్ లో అమితాబ్ నటించగా, డాన్, డాన్ 2 చిత్రాల్లో షారూఖ్ ఖాన్ గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించారు. ఇప్పుడు ఆ ఛాన్స్ రణ్ వీర్ సింగ్ కి వచ్చింది. ఇక డాన్ 3లో షారూఖ్ నటించకపోయినా కానీ డాన్ గా నటించే అవకాశం ఆయనను కూతురు సుహానా సినిమా రూపంలో వరించింది.