"హుకుమ్ " జారీ చేస్తారా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ గత సంవత్సరం కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ గత సంవత్సరం కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటి. ఇది రజనీలోని మాస్ అండ్ క్లాస్ అవతార్‌ను మరోసారి వెండితెరపై ఆవిష్కరించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నెల్సన్ గత కొన్ని నెలలుగా జైలర్ సీక్వెల్ కోసం పని చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సీక్వెల్ టైటిల్ ఖరారైంది. ప్రముఖ తమిళ మీడియా నివేదిక ప్రకారం... నెల్సన్ సీక్వెల్ టైటిల్‌గా `హుకుమ్`ని పరిశీలిస్తున్నారు. జైలర్‌లోని హుకుమ్ పాట ఒక భారీ చార్ట్‌బస్టర్.. అది విడుదలైనప్పటి నుండి హుకుమ్ అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఆకర్షిస్తోంది. అందువల్ల ఈ ఆకర్షణీయమైన పదంతో సీక్వెల్‌కు టైటిల్ పెట్టడం సముచితంగా ఉంటుందని నెల్సన్ భావిస్తున్నాడు.
నిజానికి ఈ సీక్వెల్‌కి `జైలర్ 2`ని టైటిల్‌గా పరిగణించారని, అయితే హుకుమ్ సరైన ఎంపిక అని టీమ్‌లోని మెజారిటీ వ్యక్తులు భావించారని కూడా తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే మొదటి డ్రాఫ్ట్ స్క్రిప్టును లాక్ చేసారని తెలుస్తోంది. తలైవర్ 171 సినిమాని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ జైలర్ సీక్వెల్ కోసం పని చేయడం ప్రారంభిస్తాడు. ఈ సీక్వెల్ 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. జైలర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్ టైగర్‌గా, ముత్తువేల్ పాండియన్ గా కనిపించాడు. దర్శకుడు మునుపటి కథనానికి పర్ఫెక్ట్ సీక్వెల్ కోసం పని చేస్తున్నాడు. సూపర్ స్టార్ తో పాటు, నిర్మాతలు స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసాక జూన్ 2024 నుండి దర్శకుడు ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తాడు. జైలర్ 2 షూటింగ్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. రజనీ కాల్షీట్లు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.