వెయ్యి మందిని ఒకేసారి పంపించు

శంక‌ర్ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తీ ఫైట్ లో ఓ కాన్సెప్ట్ క‌నిపిస్తుంది.

Apr 20, 2024 - 14:59
 0
వెయ్యి మందిని ఒకేసారి పంపించు

శంక‌ర్ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తీ ఫైట్ లో ఓ కాన్సెప్ట్ క‌నిపిస్తుంది. రొటీన్ కి భిన్నంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు డిజైన్ చేయించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. 'అప‌రిచితుడు'..' 'శివాజీ'...'ఐ' త‌ర్వాత ఆ రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు మ‌ళ్లీ వెళ్లింది లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా తెర‌కెక్కిస్తోన్న ఆర్సీ 16 లో అంత‌కు మించి హైఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాలు డిజైన్ చేసిన‌ట్లు ఇప్ప‌టికే తెలిసింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ఉన్నాయ‌ని రివీల్ అయింది. షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్త‌వ్వ‌డంతో ఆ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా పూర్త‌య్యాయి. ! తాజాగా క్లైమాక్స్ యాక్ష‌న్ స‌న్నివేశం ఒక‌టి నెక్స్ట్ లెవ‌ల్ లో ఉండ‌బోతుంది అన్న లీక్ అందింది. చ‌ర‌ణ్ ఏకంగా ఒకేసారి 1000 మందితో త‌ల‌పేడాలా ఓ యాక్ష‌న్ స‌న్నివేశం ఉందిట‌. ఈ ఫైట్ క్లైమాక్స్ కి ముందు వ‌స్తుందని చిత్ర‌వర్గాల నుంచి లీకైంది. త‌దుప‌రి షెడ్యూల్ లో ఈ యాక్ష‌న్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ఫైట్ స‌న్నివేశాన్ని భారీ ఎత్తున విదేశీ పైట‌ర్లు- స్థానిక ఫైట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఉంటుందిట‌. విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌న్నారుట‌. చ‌ర‌ణ్ వాళ్లంద‌రిపై ప్ర‌తిదాడికి దిగే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.  అయితే ఈ ఫైట్ కోసం చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధం  అయ్యాడా? లేదా? అన్న‌ది మాత్రం ఇంకా లీక్ అవ్వ‌లేదు. శంక‌ర్ ఓ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఫైట్ డిజైన్ చేస్తే దానికి సంబంధించి హీరోకి ప్ర‌త్యేక‌మైనట్రైనింగ్ ఇప్పిస్తారు. మ‌రి చ‌ర‌ణ్ కి ఆ ర‌క‌మైన ట్రైనింగ్ ముందే ఇప్పించారా? లేదా? అన్న‌ది తెలియాలి. అలాగే ఈ ఫైట్ చిత్రీక‌ర‌ణ ఎక్క‌డ ఉంటుంది? అన్న‌ది తెలియాలి. క్లైమాక్స్ స‌న్నివేశాలు రాజ‌మండ్రి..విశాఖ ప‌ట్ట‌ణంలో పూర్తిచేస్తార‌ని ఇప్ప‌టికే యూనిట్ రివీల్ చేసింది. మ‌రి వాటితో పాటు ఈ ఫైట్ ని ఆయా ప్రాంతాల్లో షూట్ చేస్తారా? లేక‌ హైద‌రాబాద్ వేదిక‌గా చిత్రీక‌రిస్తారా? అన్న‌ది తెలియాలి. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. అటుపై దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా కియారా అద్వాణీ న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు