చందమామ క్రేజ్ తగ్గలా..
కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు.
కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. తమిళంలో స్టార్ హీరోల కు ఈక్వల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ గా నయనతార లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ నయనతార దూకుడు తగ్గిందని చెప్పొచ్చు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న నయనతార బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు అందుకుంటుందట. అయితే సొంత భాష తమిళంలో మాత్రం నయనతారని కాదని త్రిష, కాజల్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ లో కథా బలం ఉన్న పాత్రల్లో నటించాలంటే మొదట నయనతారనే ఫిక్స్ చేస్తారు. కానీ ఈమధ్య కాలంలో మారిన కాలిక్యులేషన్స్ ప్రకారం నయనతారని పక్కన పెట్టి త్రిషకు అవకాశాలు ఇస్తునారు. మణిరత్నంతో పొన్నియన్ 1, 2 సినిమాలతో పాటుగా విజయ్ లియో సినిమాలతో త్రిష సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలతో త్రిష ఇప్పుడు కోలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. అయితే నయనతారని త్రిష క్రాస్ చేసి భారీ రెమ్యునరేషన్ అందుకుంటుండగా ఆమె ఆఫర్లను త్రిషతో పాటు కాజల్ కూడా దక్కించుకుందని టాక్. ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ కూడా కొద్దిపాటి గ్యాప్ ఇవ్వగా కెరీర్ మళ్లీ స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తుంది కాజల్. ఈ టైం లో అమ్మడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించాలని చూస్తుంది. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. సినిమా టీజర్ అయితే కాజల్ ని కొత్తగా ప్రెజెంట్ చేశారని అనిపిస్తుంది. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన కాజల్ ఇక మీదట లీడ్ రోల్ లో చేసి అదరగొట్టాలని చూస్తుందిల్. సత్యభామ హిట్ పడితే మాత్రం తమిళంలో త్రిషతో పాటు కాజల్ కూడా నయనతారకు చెక్ పెట్టేయడం ఫిక్స్ అని చెప్పొచ్చు. త్రిషతో పోల్చుకుంటే కాజల్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కాబట్టి నయనతార, త్రిషల కన్నా ముందు కాజల్ కే ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కాజల్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. కాజల్ తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని ఆమె క్రేజీ ఫ్యాన్స్ కోరుతున్నారు. సత్యభామతో పాటుగా కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా కాజల్ నటించింది.