ధనుష్-ఐశ్వర్యలకు కోర్టు ఉత్తర్వులు
ప్రముఖ టాలీవుడ్ నటుడు ధనుష్ రజనీకాంత్ అల్లుడని అందరికీ తెలుసు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు ధనుష్ రజనీకాంత్ అల్లుడని అందరికీ తెలుసు. ఐశ్వర్యను 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు మగ పిల్లలు. గత కొంతకాలంగా ఐశ్వర్య, ధనుష్ వేర్వేరుగా ఉంటున్నారు. ఫైనల్ గా ఇద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. కాగా ధనుష్, ఐశ్వర్య లు ఇద్దరూ అక్టోబర్ 7న కోర్టుకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు