భారత్ లో కుట్రకు ఖలిస్థాన్ గ్రూప్ కుట్ర
ఎన్ ఐఎకు హెచ్చరికలు జారీ చేసిన ఇంటలిజెన్స్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఖలిస్థానీ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ ఎన్ ఐఎకు ఆదివారం మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎన్ ఐఏ అలర్టయ్యింది. విదేశాల్లో ఉన్న ఐదుగురు ఖలిస్థానీ ఉగ్రవాదులు ఈ కుట్రకు తెరలేపుతున్నట్లు గుర్తించింది. పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది కమల్‌జీత్ శర్మతో ఈ ఐదుగురు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఏఈలో నివసిస్తున్న బల్జీత్ సింగ్ (బల్జీత్ మౌర్), ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గుర్జీత్ సింగ్, కెనడాలో నివసిస్తున్న ప్రిన్స్ చౌహాన్, అమెరికాలో నివసిస్తున్న అమన్ పూరేవాల్, పాక్ కు చెందిన బిలాల్ మన్షేర్ ఈ కుట్రలో పాలుపంచుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ డబ్బు ద్వారా అక్రమ మార్గాల్లో భారత్ కు ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాకు వినియోగిస్తున్నారని గుర్తించింది. ఈ ఉగ్రవాదులకు ఇంకా భారత్ నుంచి పెద్ద యెత్తున హవాలా రూపంలో డబ్బులు అందుతున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఐదుగురు ఎన్ ఐఏ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పాటియాల జైలులో ఉన్న కమల్ జీత్ పై ఇప్పటికే మూడు చార్జీ షీట్ లను ఎన్ ఐఏ దాఖలు చేసింది.