కరాచీలో ఉగ్రదాడి ఇద్దరు చైనీయులు మృతి

తీవ్రంగా ఖండించిన రాయబార కార్యాలయం దాడికి బీఎల్​ ఏ కారణం

Oct 7, 2024 - 13:10
 0
కరాచీలో ఉగ్రదాడి ఇద్దరు చైనీయులు మృతి

ఇస్లామాబాద్​: చైనా రాయబార కార్యాలయమే టార్గెట్​ గా కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి భారీ పేలుడు జరిగింది. ఈ పేలుళ్లలో ఇద్దరు చైనా జాతీయులు మృతి చెందినట్లుగా సోమవారం పాక్​ లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉగ్రవాదులు రాయబార కార్యాలయాన్ని టార్గెట్​ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి బీఎల్​ ఎ (బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ) కారణమని తెలిపింది. ఈ దాడిలో పదిమందికి గాయాలయ్యాయి. పోర్ట్​ ఖాసిమ్​ ఎలక్ర్టిక్​ సంస్థకు చెందిన కాన్వాయ్​ పై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అమాయక ప్రజలను బలిగొన్న ఉగ్రచర్యలను చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘాన్​, ఇరాన్​ సరిహద్దులో ఉన్న బలూచిస్థాన్​ ప్రావిన్స్​ కు స్వాతంత్ర్యాన్ని ఈ ఉగ్ర సంస్థ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పలువిధ్వంసక దాడులకు తెగబడుతోంది. ఇంతకుముందు కూడా చైనా పాక్​ లోని గదర్​ లో నిర్వహిస్తున్న పోర్టుపై దాడి చేసింది. ఐదుగురు చైనీయులను పొట్టన బెట్టుకుంది.