చార్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
చార్ ధామ్ యాత్ర కు భక్తులు పోటెత్తుతున్నారు. గతంలోని రికార్డులు బద్ధలయ్యేలా భక్తులు కొన్ని కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.
నైనిటాల్: చార్ ధామ్ యాత్ర కు భక్తులు పోటెత్తుతున్నారు. గతంలోని రికార్డులు బద్ధలయ్యేలా భక్తులు కొన్ని కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చార్ ధామ్ యాత్రలకు వచ్చినట్లు అధికారులు వివరించారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆ రాష్ర్ట ప్రభుత్వం పెద్ద యెత్తున భక్తుల కోసం సౌకర్యాలను కల్పించింది. అంబులెన్సులు, భద్రతా బలగాలు, మందులు, ఎమర్జెన్సీ సర్వీసులను అలర్ట్ చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసింది. అదే సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ర్ట ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా భక్తులు పరిగణనలోకి తీసుకొని అధికారుల సూచనలు, సలహాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.