రాహుల్​ పై కంగనా ఫైర్​

Kangana fire on Rahul

Sep 20, 2024 - 19:39
 0
రాహుల్​ పై కంగనా ఫైర్​

సిమ్లా:  అధికారం కోసం రాహుల్​ గాంధీ దేశాన్ని ముక్కలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని మండి ఎంపీ కంగనా రౌనత్​ విమర్శించారు.  శుక్రవారం మరోమారు రాహుల్​ ను టార్గెట్​ చేశారు. తన నియోజకవర్గం మండిలో మీడియాతో మాట్లాడుతూ..విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడాలో, మాట్లాడకూడదో తెలియని వారిలా మాట్లాడుతూ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఏ దేశంలోనైనా పౌరసత్వానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నారు. కానీ ఇతర మతాల పేరుతో, నకిల పేర్లతో స్థానిక ప్రజల భద్రతకు హాని కలికిచే చర్యలే పెద్ద సవాల్​ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్​ గాంధీ ఈ పనులు చేస్తున్నారని విమర్శించారు.

తాను నటించిన చిత్రం ఎమర్జెన్సీ విడుదలలో జాప్యంపై మాట్లాడారు. నిర్మాతలతో కలిసి సినిమా నిర్మించేందుకు తాను కూడా భాగస్వామ్యం అయ్యానని తెలిపారు. సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో నిర్మాతలు, సినీ కార్మికులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సెన్సార్​ బోర్డు వీలైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేయాలని కంగనా రౌనత్​ విజ్ఞప్తి చేశారు.