దోడాలో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు మృతి
Two terrorists were killed in an encounter in Doda
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం ఇటీవల కేంద్ర ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని అడవులు, కొండా కోనలు, గుహాలు అనేక ప్రాంతాల్లో అణువణువునా భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దోడా జిల్లాలోని గండోహ్ బజాద్ గ్రామం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ లో ఉండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. కాగా జూన్ 11న దోడా జిల్లాలో చటర్ ఆర్మీ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉగ్రవాదులు వారేనని ఆర్మీ, పోలీసులు భావిస్తున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారం రోజునే రియాసీలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీంతో ఈ ఘటనను కేంద్ర హోంశాఖ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఆ వెంటనే మూడు, నాలుగు రోజులపాటు చేపట్టిన హై లెవెల్ సమావేశంలో ఉగ్రవాదుల కట్టడికి బ్లూ ప్రింట్ ను రూపొందించాయి.