పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటుపై ఎంపీకి విజ్ఞప్తి
Appeal to MP on establishment of passport center
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో పాస్ పోర్టు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ర్ట అధ్యక్షులు కొండాపురం జగన, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు జెల్ల సురేష్, యాదగిరి, రాజులు ఎంపీ రఘునందన్ రావును కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజ్ఞాపన పత్రంపై ఎంపీ రఘునందన్ రావు అనుకూలంగా స్పందించారని తెలిపారు. పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటుకు ఉన్నతాధికారులు, కేంద్ర బీజేపీ నాయకులతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.