ఇస్లామాబాద్ కు జై శంకర్
Jai Shankar to Islamabad
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. మంగళవారం ఎస్ సీవో సదస్సులో హాజరయ్యేందుకు వెళ్లిన ఆయనకు చిన్నారులు పుష్పగుచ్ఛాలందజేసి ఘన స్వాగతం పలికారు. 8యేళ్ల 10 నెలల తరువాత మంత్రి జై శంకర్ పాక్ లో అడుగిడారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైతే సంతోషంగా ఉండేదని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సదస్సుకు భారత్ తోపాటు పది దేశాల ప్రముఖులు, ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు వెళ్లినా పాక్ తో ఎలాంటి చర్చలు జరపబోనని జై శంకర్ ఇప్పటికే ప్రకటించారు.