సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణలు
మరింత పెరగనున్న ఓట్ల శాతం
జేజేపీ, ఏఏపీ పొత్తు ఇండి కూటమికి విఘాతం
అన్ని వర్గాలకు సమప్రాధాన్యంతో ముందుకు
67 సీట్ల కేటాయింపు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
హరియాణా ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలీస్తే 2019లో సీట్ల వాటా తగ్గినప్పటికీ ఓట్ల శాతం మెరుగ్గా ఉంది. 2014తో పోలిస్తే 2019లో బీజేపీ ఓట్ల శాతం 3.39 శాతంతో 36.49 శాతం పెరిగింది. అయితే ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో హరియాణాలో కమలంపార్టీ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ (ఎన్డీయే) ఐదు స్థానాలను సాధించింది. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే ఇండి కూటమి పార్టీలన్నీ కలిసి ఐదు సీట్లను సాధించాయి. అదే సమయంలో వారి ఓట్ల షేర్ బీజేపీతో చాలా వెనకబడి ఉంది. బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో 46.11 శాతం ఓట్లు పడడం విశేషం. బివానీ–మహేంద్రనగర్, కురుక్షేత్రం, కర్నల్, గుర్గావ్, ఫరీదాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. గెలిచిన ఎంపీ స్థానాల్లోనే 44 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ ఆధిపత్యం సాధించినట్లయింది. అంటే హరియాణాలో అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలకు గాను 44 స్థానాల్లో విజయం ఖాయమే అనే వాదన వినిపిస్తుంది. అదే సమయంలో పార్టీ గెలుపొందని మిగతా 46 స్థానాలపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ పార్టీ 67 మంది అభ్యర్థుల లిస్టును జారీ చేసింది. ఇందులో 40 మంది ముఖాలను మార్చింది. 27 మంది కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. ముగ్గురు మంత్రులు సహా, 8మంది ఎమ్మెల్యేలకు టికెట్లను కేటాయించలేదు. 8మంది మహిళలకు టికెట్లను కేటాయించారు. అదే సమయంలో కబడ్డీ క్రీడాకారుడు దీపక్ హుడ్డాకు కూడా టికెట్ కేటాయించింది.
టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని బీజేపీ పాటించింది. 67మంది అభ్యర్థులలో ఐదుగురు వైశ్యవర్గానికి చెందినవారు, 9మంది బ్రాహ్మణులు, 13 జాట్, 2 బిష్ణోయ్, 1 జాట్ సిక్, 8 మంది పంజాబీ, 1 రోడ్, ఓబీసీ నుంచి 14 మందికి టికెట్ కేటాయించింది. 5 అహిర్, 5 గుజ్జర్, 1 కాంబోజ్, 1 కాశ్యప్, 1 కుమ్మరి, 1 సైనీ వర్గాలకు టికెట్లు కేటాయించింది. ఇదే సమయంలో నిమ్నవర్గాలకు 13 టికెట్లు కేటాయించి సామాజిక న్యాయాన్ని పాటించింది.
ఇక్కడ బీజేపీకి మరో ప్లస్ పాయింట్ ఉంది. హరియాణా రాష్ర్టంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా కేంద్రంలో ఉండే పార్టీతో కలిసి వెళతారు. ఈ పరిణామం కూడా బీజేపీకి లబ్ధి చేకూర్చనుంది.
బీజేపీ సీట్ల కేటాయింపులో పాటించిన సామాజిక న్యాయంతో కాంగ్రెస్ కూటమి పార్టీల ఓట్లు, సీట్లలో భారీ చీలికలు చోటుచేసుకోనున్నాయి. ఇదే సమయంలో కూటమి అంతర్గత కుమ్ములాటలు కూడా ఇక్కడ నష్టం చేకూర్చనున్నాయి. దీంతో గుజరాత్ లో ట్రెండ్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. అక్కడ ఆప్ పార్టీ ఒంటరిపోరుతో కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచింది. కాంగ్రెస్ కు దక్కాల్సిన ఐదు స్థానాలను తానెగరేసుకుపోయింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ హరియాణా ఎన్నికల్లో ఆప్ తో పొత్తు పెట్టుకుంది. సరిగ్గా ఇక్కడే వీరి సమీకరణాలపై ఓటర్లు దెబ్బకొట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జేజేపీ, ఏఏపీ లాంటి పార్టీలు జతకట్టడంతో ఇండి కూటమి పార్టీ ఓట్లలో భారీ చీలికలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవే అంశాలు బీజేపీకి లాభించనున్నాయి.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది. సామాజిక సమీకరణను పాటిస్తూ అనేక ఒడపోతల తరువాత బీజేపీ 67మంది అభ్యర్థుల లిస్టును రూపొందించింది. అత్యధికంగా గతంలో గెలిచిన వారిని కూడా పక్కన పెడుతూ ఆయా ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గాలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇదే అంశం బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనా హరియాణాలో బీజేపీ గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జెజెపి), అభయ్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మరియు మరికొన్ని చిన్న పార్టీలు వంటి ఇతర రాజకీయ పార్టీలు అధికార వ్యతిరేక ఓట్లను విభజించబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పోటీ కూడా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారగా, అధికార బీజేపీకి వరంలా మారింది.