ఉక్రెయిన్ తో శాంతి చర్చలు భారత్, బ్రెజిల్, చైనాలే మధ్యవర్తులు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌తో జరిపిన శాంతి చర్చల్లో భారత్, బ్రెజిల్, చైనాలు మధ్యవర్తి పాత్ర పోషించనున్నాయని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమంలో తెలిపారు. దీంతో శాంతికి మార్గాలు తెరుచుకున్నాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. కానీ అదే సమయంలో పుతిన్ తిరకాసు పెట్టారు. ఉక్రెయిన్ డాన్ బాస్ ప్రాంతాన్ని మాత్రం స్వాధీనం చేసుకుంటామన్నారు. భారత ప్రధాని మోదీ ఇరుదేశాలను సందర్శించి శాంతి, చర్చల ద్వారానే సామరస్య వాతావరణాన్ని సృష్టించామని. ఇందుకు భారత్ సహకారం ఉంటుందన్నారు. యుద్ధం శాంతికి పరిష్కార మార్గం కాదని పుతిన్ కు విన్నవించారు. ఈ నేపథ్యంలో పుతిన్ ప్రకటన వెలువడడం విశేషం.
కాగా రష్యా పర్యటనలో ఉండగా జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉరెయిన్‌లో కూడా మోదీకి భారత్ తమ విధానాలపై కట్టుబడి ఉందని ప్రకటించడంతో జెలెన్స్‌కీలో కూడా శాంతి చర్చలపై ఆశలు రేకెత్తించాయి. ఏది ఏమైనా పుతిన్ ప్రకటనపై అంతర్జాతీయంగా హర్షం వ్యక్తం అవుతోంది.