47వ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

The 47th President is Donald Trump

Nov 6, 2024 - 14:22
 0
47వ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​
హోరాహోరీ పోరులో అలవోక విజయం
హారీస్​ ను నిరాశ పరిచిన ఫలితాలు
చరిత్రలో గొప్పవిజయమన్న ట్రంప్​ 
ఎలన్​ మస్క్​ కు కృతజ్ఞతలు
అత్యుత్తమ దేశంగా తీర్చి దిద్దుదాం
హామీలన్నీ నెరవేరుస్తా
ఫ్లోరిడా ప్రసంగంలో ట్రంప్
వాషింగ్టన్​ డీసీ: రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు అమెరికన్​ మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన 270 పూర్తి మెజార్టీ స్థానాలను సాధించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు డెమోక్రటిక్​ అభ్యర్థి కమలా హారీస్​ 219 ఎలక్టోరల్​ ఓట్లు మాత్రమే సాధించి అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ట్రంప్​ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. ఓట్ల లెక్కింపు చివరి దశలో ఉండగా ట్రంప్​ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్​ బీచ్​ కు చేరుకొని తన మద్ధతుదారులతో మాట్లాడారు. వారికి కృతజ్ఞతలు తెలిఆపరు. దేశచరిత్రలో గొప్ప రాజకీయ ఘట్టమని అభివర్ణించారు. రాబోయే కాలం అమెరికా కళలను నిజం చేసే దిశలో ఉంటుందన్నారు. ఈ ప్రాంత భవిష్యత్​ కోసం పనిచేస్తామన్నారు. 
ఎలన్​ మస్క్​ మద్ధతును కొనియాడారు. అసాధ్యమైన పనిని అంతా కలిసి సుసాధ్యం చేసి చూపించామన్నారు. స్వింగ్​ స్టేట్స్​ నుంచి పూర్తి మద్ధతు లభించడం సంతోషకరమన్నారు. అమెరికన్​ ప్రజలు తమకు పూర్తి శక్తినిచ్చారని ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. 
తన ప్రతి క్షణం అమెరికా వృద్ధి కోసమే పనిచేస్తానని, ఈ విజయం ప్రతి అమెరికన్ విజయమన్నారు. అమెరికాలోకి అక్రమ చొరబాట్లను నియంత్రిస్తామన్నారు. ప్రపంచంలో యుద్ధ పరిస్థితులను శాంతింపచేసే పని చేపడతామన్నారు. అంతరిక్షంలో ఎలన్​ మస్క్​ సేవలను ప్రశంసించారు. అమెరికాను మస్క్​ గొప్పదేశంగా చూడాలనుకోవడం సంతోకరమన్నారు. తన హయాంలో అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ట్రంప్​ పేర్కొన్నారు. సరిహద్దు భద్రతను పెంచుతామన్నారు. 
 
ప్రధాని మోదీ అభినందనలు..

డొనాల్డ్​ ట్రంప్​ చారిత్రాత్మక విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ట్రంప్​ నేతృత్వంలో భారత్​–యూఎస్​ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత సహకారాన్ని పునరుద్ధరించేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందిద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.