కాంగ్రెస్, కూటమికి ఝలక్! ఛత్రాలో ముస్లింల బహిష్కరణ
ముస్లిం మతపెద్దల నిర్ణయం
రాంచీ: కాంగ్రెస్, కూటమికి పెద్ద దెబ్బ తగిలింది. ఝార్ఖండ్ మహాకూటమిలోని ఛత్రా అభ్యర్థి కెఎన్ త్రిపాఠిని బహిష్కరిస్తున్నట్లు ముస్లిం సంస్థలు శనివారం ప్రకటించాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా కూటమిలో కలకలం రేగింది. బీజేపీకే మద్దతివ్వాలని నిర్ణయించారు. ముస్లింలాం కాంగ్రెస్, మహాకూటమి కపటనాటకాలతో మేల్కోన్నారని గ్రహించాలని ముస్లిం మతపెద్ద తెలిపారు. కాంగ్రెస్,కూటమి తమ ఓట్లను దండుకొని అన్యాయం చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు.
తాము ఎవ్వరికంటే వారికి తివాచీలు పరిచే ముస్లింలం కాదని అన్నారు. నీతి నీజాయితీ తమలోనే ఉన్నాయని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో గిరిజనుల తరువాత ముస్లింలు రెండో స్థానంలో ఉండడం విశేషం. కాంగ్రెస్, మహాకూటమికి సంబంధించి ఝార్ఖండ్ లో 14 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని స్పష్టం చేశారు. అందుకే ఈ నిర్ణయాన్ని స్వంతంగా తీసుకున్నామని ప్రలోభాల మేరకు తీసుకోలేదని స్పష్టం చేశారు.