మహిళలను వేధిస్తే కాళ్లు, చేతులు విరగ్గొట్టాలి

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ

Nov 5, 2024 - 18:39
 0
మహిళలను వేధిస్తే కాళ్లు, చేతులు విరగ్గొట్టాలి

ముంబాయి: మహిళల భద్రత కోసం పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టాలని, అవసరం అయితే వారిని వేధించేవారి కాళ్లు చేతులు విరగ్గొట్టాలని కేంద్రమంత్రి నితీన్​ గడ్కరీ అన్నారు. నాగ్​ పూర్​ లోని తాజ్​ బాగ్​ లో ఎన్నికల ప్రచారంలో మంగళవారం ప్రసంగించారు. ఈ ప్రాంతంలో ముస్లిం సోదరీమణులు కూడా సురక్షితంగా తిరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి కాంగ్రెస్​ 60యేళ్లుగా ఏం చేసిందని నిలదీశారు. కులవాద రాజకీయం, ప్రజల మనస్సులో విషబీజాలు నాటడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం వంటి ప్రతీకారేచ్ఛ చర్యలే కనిపిస్తాయన్నారు. 

కాంగ్రెస్​ పార్టీయే రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందన్నారు. తామెన్నడూ బాబా సాహెబ్​ అంబేద్కర్​ రాజ్యాంగాన్ని మార్చలేదని, మార్చబోమని పునరుద్ఘాటించారు. లోక్​ సభలో రాజ్యాంగ పత్రులను చించి అవమాన పరిచిన చరిత్ర కాంగ్రెస్​ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజ్​ బాగ్​ లో గుంతలు లేని రోడ్లను నిర్మించామన్నారు. బీజేపీ ఎప్పుడూ కులరాజకీయాలు చేయలేదన్నారు. గంజాయి, డ్రగ్స్​ వంటి వ్యాపారాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ కమిషనర్​ కు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.