భూతద్దంలో చూసినా ఆ పార్టీలు కనిపించడం లే
రామ మందిర ప్రాణత్యాగాలను కించపరుస్తారా? భగవంతుడితో ఓటు బ్యాంకు రాజకీయాలా? ఆర్టికల్ 370ని రద్దు చేస్తారా? కయ్యానికి కాలు దువ్వితే ఇంట్లోకి వెళ్లి సమాధానం చెప్పాం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని రక్షించాం ఎస్పీ హయాంలో రౌడీ రాజ్యం బీజేపీ హయాంలో సంక్షేమ ప్రభుత్వం బరేలీ ఎన్నికల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
లక్నో: రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో హస్తం, కూటమి పార్టీలు మచ్చుకైనా లేవని, భూతద్దంలో చూసినా కనిపించడం లేదని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన ఎన్నికల సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. జూన్ నాలుగు తరువాత వీరి యాత్రలు సమాప్తమై పోతాయన్నారు. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి, మహిళాభివృద్ధికి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు జరుగుతున్న ఎన్నికలని చెప్పారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మందిర నిర్మాణం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. అఖిలేష్, రాహుల్, డింపుల్, ప్రియాంకలకు కూడా ఆహ్వానాలను పంపితే పార్టీల సంగతి అలా ఉంచి భగవంతుని దర్శనానికి రాలేకపోయారని ధ్వజమెత్తారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రామాలయ నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించిన వీరు దేశ భవిష్యత్తును ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు.
70ఏళ్లుగా ఆర్టికల్ 370ని రద్దు చేయలేకపోయిన కాంగ్రెస్ తాము రద్దు చేస్తే విమర్శలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఉగ్రవాదం నుంచి పూర్తిగా దేశాన్ని విముక్తి కల్పించామన్నారు. ఉగ్రవాదంతో మాటిమాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ కు రెండుసార్లు వారి ఇంట్లోనే సమాధానం చెప్పివచ్చామన్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వైపు దేశ ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ వారికి వ్యాక్సిన్లు అందజేస్తూనే మరో వైపు ఆర్థిక రంగాన్ని కాపాడుకున్న ఘనత మోదీ ప్రభుత్వానిదని షా పేర్కొన్నారు. గత ఎస్పీ ప్రభుత్వ హయాంలో యూపీ మొత్తం రౌడీలే రాజ్యమేలేవారన్నారు.
2017లో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం యోగి నేతృత్వంలో యూపీ అభివృద్ధిని ప్రజలు కళ్లారా వీక్షిస్తున్నారని కొనియాడారు. సీఎం యోగి అల్లర్లు, రౌడీలపై ఉక్కుపాదం మోపి యూపీని సస్యశ్యామలంగా, అభివృద్ధి రాష్ర్టంగా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. యూపీకి కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎస్పీ, కాంగ్రెస్‌లు కుటుంబ పార్టీలని కేవలం తమ కుటుంబాల అభ్యర్థులనే ఎన్నికల్లో రంగంలోకి దింపుతూ తమ తమ వర్గాల వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఎస్పీ హయాంలో యూపీలో దేశీయంగా ఆయుధ సంస్థలు ఉంటే, నేడు ఫిరంగులు, క్షిపణుల తయారీ కర్మాగారం స్థాపించి పాక్ కు బుద్ధి చెప్పేందుకు వాడుతున్నామని మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.