ఉప వర్గీకరణకు సుప్రీం ఓకే

విచారించిన ఏడుగురు సభ్యుల  ధర్మాసనం 6:1తో వర్గీకరణ తీర్పు తీర్పుపై హర్షం 

Aug 1, 2024 - 13:20
 0
ఉప వర్గీకరణకు సుప్రీం ఓకే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే హక్కు ఆయా రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం ఉప వర్గీకరణ కేసును సుప్రీం విచారించింది. కేసును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్​ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసం విచారించింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని పేర్కొంది. 

ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనబెట్టింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.

ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్‌డ్‌ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది.

 ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.

ఉప వర్గీకరణ గతంలోని తీర్పుపై పంజాబ్​ ప్రభుత్వం, ఎమ్మార్పీఎస్​ లు సుప్రీంలో పిటిషన్​ లు దాఖలు చేశాయి.