నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దాడులపై ఏనాడు ఈ వర్గాలు, కుహానా రాజకీయ నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపలేదు. కానీ హిజ్బొల్లా అనే ఉగ్రవాద సంస్థకు చీఫ్ నస్రుల్లా ను ఇజ్రాయెల్ హతమారిస్తే కోల్ కతా, ముంబాయి, జమ్మూకశ్మీర్ లలో పలువురు పెద్ద యెత్తున నిరసనలు చేపట్టారు. వీరి నిరసనలకు తోడు బడా రాజకీయ నాయకులు కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన గొప్ప నాయకుడని కొనియాడుతూ కన్నీరు కార్చడం విడ్డూరం.
సైనికుల మరణాలపై స్పందించరా?..
భారత సైనికులు, హిందువులు, దేశ సమగ్రతపై ఉగ్రవాదులు దాడులు చేస్తే మాత్రం మౌనం వహిస్తారు? అదే వారిని సైన్యం మట్టుబెడితే కాలిపై కాల్చకుండా తలపై ఎలా కాల్చారు? గుండెల్లో ఎలా గురిపెట్టారు? అని ప్రశ్నలు లేవనెత్తుతారు. అదే ఉరి సెక్టార్ లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకుంటే కిమ్మనరు. పార్లమెంట్ పై దాడిచేస్తే మౌనం వహిస్తారు. పైగా బందీలుగా ఉన్న ఉగ్రవాదులను జైలు నుంచి విడిపిస్తార?ని మరి మాట ఇచ్చి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇదే నాయకుడి మృతిని నిరసిస్తూ పాక్ లో నిరసనలు చేస్తే ఆ దేశ పోలీసులు చొక్కాలు విప్పి మరీ లాఠీచార్జీ చేసిన దృశ్యాలు సోషల్ మాధ్యమంగా కనిపిస్తున్నాయి.
పక్కదేశంతో చర్చలు జరపాలా? ఉచిత సలహాలు..
బంగ్లాదేశ్ లో ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు పది రోజుల్లోగా వెళ్లకుంటే వారిని చంపేస్తామని అక్కడ బహిరంగంగానే హెచ్చరికలు చేస్తునారు. పైగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించుకునే దుర్గాదేవి విగ్రహాలను ఎవరైనా రూపొందిస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ ఈ కుహానా రాజకీయనాయకులకు, దేశ విద్రోహ, వ్యతిరేక శక్తులకు కనిపించవు. 69 హిందూ దేవాలయాలను అక్కడ నేలమట్టం చేస్తే స్పందించరు. వేలాది హిందువుల దుకాణాలకు నిప్పుపెడితే తప్పని చెప్పరు. పైగా పక్కదేశం చంకనెక్కి ఆ దేశంతో చర్చలు జరపాలని, మాట్లాడాలని ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటారు. వీరు కళ్లు, చెవులు ఉన్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు ఒక్కోసారి ఆలోచిస్తే ఉద్భవిస్తాయి.