హస్తానికి టాటా.. బీజేపీలో చేరిక.. రాహుల్​ పర్యటనకు ముందు ఎమ్మెల్యే అర్జున్​

కాంగ్రెస్​పార్టీకి క్రమంగా దిగ్గజ నేతలే ‘హ్యాండ్’ ఇస్తున్నారు. మంగళవారం గుజరాత్​పోర్​ బందర్​ ఎమ్మెల్యే అర్జున్​ మోద్వాడియా కాంగ్రెస్​ నాయకుడు బీజేపీలో చేరారు.

Mar 5, 2024 - 14:45
 0
హస్తానికి టాటా.. బీజేపీలో చేరిక.. రాహుల్​ పర్యటనకు ముందు ఎమ్మెల్యే అర్జున్​

గాంధీనగర్: కాంగ్రెస్​పార్టీకి క్రమంగా దిగ్గజ నేతలే ‘హ్యాండ్’ ఇస్తున్నారు. మంగళవారం గుజరాత్​పోర్​ బందర్​ ఎమ్మెల్యే అర్జున్​ మోద్వాడియా కాంగ్రెస్​ నాయకుడు  బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం అర్జున్​ మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్లపాటు కాంగ్రెస్​తో తనకు అనుబంధం ఉందన్నారు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేడుకలను తిరస్కరించడం తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే పార్టీ నుంచి బయటికి రావాలన్న నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. 2022 ఎన్నికల్లో పోర్‌బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ బీజేపీ నాయకుడు బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మార్చి 7న గుజరాత్‌లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఈయన రాజీనామా చేశారు. గుజరాత్‌లోని అత్యంత సీనియర్ ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకులలో మోద్వాడియా ఒకరిగా నిలిచారు. ఈయన సారథ్యంలో మరో ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్అంబరీష్ ధేర్, మరో నాయకుడు ములుభాయ్ కందేరియా లు కూడా బీజేపీలో చేరారు.