ఆయుష్మాన్ భవతో ప్రజల ఆరోగ్యం బలోపేతం
ఆరోగ్య శాఖ మంత్రి జేపీ. నడ్డా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీఎం ఆయుష్మాన్ భవ దేశ ప్రజల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ. నడ్డా అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఈ అంశంపై లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ద్వితీయ ఆరోగ్య సంరక్షణ, తృతీయ ఆరోగ్య సంరక్షణ కోసం నాణ్యమైన సేవలను అందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. బ్లాక్ స్థాయిలో మూడు వేల 300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 730 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, 602 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంఎబీహెచ్ఐఎం) అనేది కేంద్ర ప్రాయోజిత పథకం, ఈ పథకానికి యేటా రూ. 64 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయనున్నారు.