ఢిల్లీ ఎన్ సీఆర్ లో స్వల్ప ప్రకంపనలు
Slight tremors in Delhi NCR
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ–ఫరీదాబాద్ ఎన్ సీఆర్ లో గంట వ్యవధిలో గురువారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని రెక్టర్ స్కేలుపై 2.4గా ప్రకంపనలు నమోదయ్యాయి.
ప్రతీయేటా ప్రపంచంలో 20వేలకు పైగా భూకంపాలు సంభవిస్తాయని ఇందులో స్వల్ప, మధ్య, తీవ్ర భూకంపాలుంటాయని అధికారులు తెలిపారు. అత్యంత స్వల్ప కంపనాల వల్ల ఎవరికీ నష్టం జరగదన్నారు. మధ్య స్థాయి భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు తక్కువగా నమోదవుతాయన్నారు. తీవ్ర స్థాయిలో మాత్రం భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు చేకూరుతాయని స్పష్టం చేశారు.
తీవ్రత ఎంత మేర నష్టం?
0 నుంచి 1.9 సీస్మోగ్రాఫ్ పై మాత్రమే నమోదవుతుంది. ఈ భూకంపం సంభవించినట్లు ప్రజలకు తెలియకపోవచ్చు.
2 నుంచి 2.9 వరకు చాలా తక్కువ కదలికలు నమోదవుతాయి. అయితే మానవాళి వీటిని గుర్తిస్తారు.
3 నుంచి 3.9 వరకు స్పష్టమైన కదలికలు కనిపిస్తాయి. భూకంపం సంభవించిందని తెలిసిపోతుంది.
4 నుంచి 4.9 వస్తువులు వాటి స్థలం నుంచి పక్కకు తప్పుకోవడం, కిందపడడం ఉంటుంది.
5 నుంచి 5.9 భారీ వస్తువులు సైతం తమ దిశను మార్చుకుంటాయి.
6 నుంచి 6.9 భవనం పునాదులకు పగుళ్లు ఏర్పడతాయి.
7 నుంచి 7.9 భవనాలు, నిర్మాణాలు కూలిపోతాయి.
8 నుంచి 8.9 అత్యంత ప్రమాదకరమైన భూకంపం ఇది. దీంతో సముద్రంలో అలల ఉధృతి పెరగడంతోపాటు సునామీ వస్తుంది.
9 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రమైన విపత్తులు సంభవిస్తాయి. దీంతో భవనాలు కుప్పకూలడంతోపాటు సునామీ వంటి ఉపద్రవాలు సంభవిస్తాయి.