గతంకంటే పెరిగిన ఓటింగ్ శాతం
ఆరుదశల్లో ఎక్కువగా పోలైన ఓట్ల సంఖ్య 2.5 కోట్లు
నా తెలంగాణ,సెంట్రల్ డెస్క్: ఆరు దశల లోక్ సభ ఎన్నికల్లో 2019తో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఆరుదశల్లో 2.5 కోట్ల మంది ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. 2019లో మొత్తం ఆరు దశల్లో 55.22 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా 2024లో 57.76 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.05 కోట్లుండగా, 61.46 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2019లో..
2019లో మొదటి విడతలో 102 సీట్లకు గాను 11.01 శాతం, రెండో విడత 88 సీట్లకు గాను 10.41 శాతం, మూడో విడత 93 సీట్లకు గాను 10.65 శాతం, నాలుగో విడత 96 సీట్లకు గాను 11.33 శాతం, ఐదో విడత 49 స్థానాలకు గాను 5.18 శాతం, ఆరో విడత 58 స్థానాలకు గాను 7.05 శాతం, ఏడో విడత 57స్థానాలకు గాను 6.19 శాతం పోలింగ్ నమోదైంది.
2024లో..
2024లో మొదటి విడతలో 102 సీట్లకు గాను 11 శాతం, రెండో విడతలో 88 స్థానాలకు గాను 10.58 శాతం, మూడో విడత 93 స్థానాలకు గాను 11.32 శాతం, నాలుగో విడత 96 స్థానాలకు గాను 12.24 శాతం, ఐదో విడత 49 స్థానాలకు గాను 5.57 శాతం, ఆరో విడత 58 సీట్లకు గాను 7.05 శాతం ఓట్లు పోలయ్యాయి.