రామేశ్వరం కేఫ్​పేలుడు.. 17 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

అదుపులో మరో ఐదుగురు అనుమానితులు

Mar 5, 2024 - 15:07
 0
రామేశ్వరం కేఫ్​పేలుడు.. 17 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం కేఫ్​లో పేలుడు కేసులో ఐసీస్, లష్కర్​ – ఏ – తోయిబాతో సంబంధాలున్న పలువురి ఇళ్లపై ఎన్​ఐఏ మంగళవారం దాడులు చేసింది. 17 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఐసీస్​ సానుభూతి పరుడు నజీర్​ ఇంటిపై దాడి చేసింది. కేఫ్​లో పేలుడుకు ఇతనే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడుకు ప్రధాన సూత్రధారి జూనైద్​అనే అనుమానం కూడా ఉంది. హవాలా లావాదేవీలకు సంబంధించి జూనైద్​పై ఇప్పటికే కేసు నమోదు కాగా అతను బెంగళూరు సెంట్రల్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రామనాథపురంలోని షంఫుద్దీన్​ ఇంటిపై దాడులు నిర్వహించారు. సిద్దార్​పేట్, బిద్వార్ కు చెందిన ఐదుగురిని ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది. విచారిస్తున్నందున వీరి వివరాలను వెల్లడించలేదు. ఈ ముగ్గురికి లష్కరే తోయిబాతో కూడా సంబంధాలున్నాయని ఎన్​ఐఏ స్పష్టం చేసింది. నజీర్​ సహచరులు జూనైద్​ అహ్మద్, సల్మాన్ఖాన్​లు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. 2023 జూలై 18న వీరి ఇళ్లపై దాడి సందర్భంగానే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్​గ్రెనేడ్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేఫ్​లో పేలుడుకు పాల్పడ్డ వ్యక్తి టైమర్​ ద్వారా బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు ముందు నిందితుడి పూర్తి కదలికలను సీసీ టీవీ ద్వారా దర్యాప్తు సంస్థలు, పోలీసులు పరిశీలించారు.