బుజ్జగింపు రాజకీయాలకు స్వస్థి బీజేపీ మాజీ మంత్రి అబ్బాస్ నఖ్వీ
Narendra Modi has stopped the politics of appeasement. Former Union Minister Abban Naqvi
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికిందని మాజీ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ దౌర్జన్యాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ దేశంలోని సంక్షోభాలను అధిగమిస్తూ పరిపాలిస్తున్నారన్నారు. దేశాన్ని గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారు పేరుగా తయారు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ముస్లిం లీగ్ ముద్ర ఉందని నఖ్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లు పనిచేయవన్నారు. యూపీలో అన్ని పార్టీల నావలు మునిగిపోనున్నాయని నఖ్వీ పేర్కొన్నారు. దేశ కీర్తి ప్రతిష్ఠలు నిలపడంలో ప్రధాని మోదీ చేసినంత కృషి ఎవ్వరూ చేయలేదని తెలిపారు.