నిలకడగానే బీజేపీ ఎంపీల ఆరోగ్యం
The health of BJP MPs is stable
నా తెలంగాణ, న్యూఢిల్లీ: పార్లమెంట్ కాంప్లెక్స్‌లో దాడికి గురైన బీజేపీ నాయకుల ఆరోగ్య పరిస్థితిపై రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వర్గాలు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సారంగికి గాయమైన చోట చర్మం వాపు వచ్చిందని, రంగు మారిందన్నారు. ముకేష్ రాజ్ పుత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నా, బీజేపీ కంట్రోల్ లో తేడాలున్నాయన్నారు. ఆయన అబ్జర్వేషన్ కొనసాగనుందన్నారు. సారంగికి కనుబొమ్మపైన చిన్నపాటి గాయానికి సిటి స్కాన్, ఎంఆర్ ఐ చేశామన్నారు. రిపోర్ట్ లలో అంతా నార్మల్ గా ఉందన్నారు.
మరోవైపు శనివారం ఉదయం పలువురు బీజేపీ నాయకులు సారంగి, రాజ్ పుత్ లను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎంపీలపై పార్లమెంట్ లో చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు మూల్యం వారు చెల్లించుకోక తప్పదన్నారు. పరామర్శించిన వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ నేత సంబిత్ పాత్ర తదితరులున్నారు. ఈ దాడులపై ఇప్పటికే రాహుల్ గాంధీపై ఆరు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదైంది. క్రైమ్ బ్రాంచ్ కు ఈ కేసును అప్పగించారు.