నేడు గాంధారి మైసమ్మ జాతర

Gandhari Maisamma fair today

Jul 21, 2024 - 08:52
 0
నేడు గాంధారి మైసమ్మ జాతర

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ శివారు జాతీయ రహదారి పక్కన గాంధారి మైసమ్మ ఆలయంలో జాతర నేడు జరుగనుంది. గాంధారి మైసమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందు కు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జాతరకు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలతో ఇతర జిల్లాల నుండి కాక మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు.  భక్తులు అమ్మవారికి మేకలు, కోళ్లు బలి ఇచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. జంతుబలుల కోసం తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లను, వాహనాల పూజల నిర్వహించేందుకు ప్రత్యేక స్థలాలను ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిపై బారీకేడ్ల ఏర్పాటు, రోడ్డు మార్గాల వద్ద పోలీస్ పెట్రోలింగ్, పెద్దఎతున బందోబస్తు ఏర్పాటు చేశామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.