ఆదర్శ ప్రాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

కలెక్టర్ అభిలాష అభినవ్

Sep 27, 2024 - 20:41
 0
ఆదర్శ ప్రాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
నా తెలంగాణ, నిర్మల్: ప్రతి ఒక్కరూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను కలెక్టరేట్ లో శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రం ఉద్యమం, నిజాం వ్యతిరేక, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. వృద్ధాప్యంలో కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గొప్ప ఉద్యమ కారుడని హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాలన్నారు. భవిష్యత్తు తరాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీపీఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.