సీఎం సహాయ నిధి పేదలకు వరం

డిసిసి అధ్యక్షులు కె శ్రీహరి రావు

Oct 24, 2024 - 20:17
Oct 24, 2024 - 20:17
 0
సీఎం సహాయ నిధి పేదలకు వరం

నా తెలంగాణ, నిర్మల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం వంటిదని డిసిసి అధ్యక్షుడు కే శ్రీహరి రావు అన్నారు. గురువారం తమ క్యాంపు నిర్మల్ పట్టణం, సారంగపూర్, లక్ష్మణ, సోన్, మామడ, మండలాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 5.70 లక్షల విలువైన చెక్కలను ఆయన ఉంది. నిర్మల్ ఎమ్మెస్సీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, లక్ష్మణచంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, మామడ మండల జడ్పీటీసీ రాథోడ్ డైరెక్టర్ సంతోష్ సోనియా, మాజీ ఏసీఐ లింగారెడ్డి, సోన్ మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, దేవరకోట చైర్మన్ కొండ శ్రీనివాస్ ఉన్నారు.