రాష్ట్ర సాధనలో జయశంకర్ కృషి మరువలేనిది

Jayashankar's contribution to the state is unforgettable

Jun 21, 2024 - 13:53
 0
రాష్ట్ర సాధనలో జయశంకర్ కృషి మరువలేనిది

నా తెలంగాణ, నిర్మల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అను క్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్ధి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్య పరిచిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ సాధనను కళ్ళారా చూడాలని కోరుకున్న జయశంకర్  కోరిక నెరవేరక మునుపే కన్నుమూయడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కూచాడి పిలుపునిచ్చారు.