గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్​

విగ్రహావిష్కరణ సభలో కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి

Jun 21, 2024 - 14:00
 0
గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్​

నా తెలంగాణ, షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని ప్రొఫెసర్ కోదండరాం, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లు అన్నారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా స్థానిక టీజేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. జయశంకర్‌ త్యాగాలను కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిజేఎస్ నాయకులు, ఉద్యమకారులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.