యోగాతోనే శారీరక, మానసిక దృఢత్వం

Physical and mental strength with yoga

Jun 21, 2024 - 13:51
 0
యోగాతోనే శారీరక, మానసిక దృఢత్వం

నా తెలంగాణ, డోర్నకల్​: యోగాతో మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందని మరిపెడ ఎస్​ ఐ హతిరామ్​ నాయక్​ తెలిపారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ ఆధ్యాత్మిక శిక్షణ సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో ఎస్​ ఐ పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ప్రతీఒక్కరూ రోజు యోగా చేయాలన్నారు. ధ్యానం ద్వారానే మానసికంగా ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్ ఐలు సంతోష్, ఝాన్సీ, హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షకులు, నిర్వాహకులు  నరేందర్, జనార్దనాచారి, శ్రీనివాస్, యాదగిరి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.