రామకృష్ణాపూర్ లో భారీ వర్షం
ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: వరుసగా కురుస్తున్న భారీ వర్షానికి రామకృష్ణాపూర్ పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యా యి. ఏ జోన్, కాకతీయ కాలనీ, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, శివాజీ నగర్, ఆర్కే వన్ బ్రిడ్జ్ మొదలైన ఏరియాలో వరదనీరు భారీగా చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెత్తా చెదారం కాలువల్లో పేరుకుపోవడంతో లోతట్టు కాలనీల్లోని మురుగునీరు బయటకు పోయే దారి లేక రోడ్లపై ఏరులై పారింది.