జన్​ ధన్​ @ 10యేళ్లు.. కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం

Jan Dhan @ 10 years.. Union Minister G. Kishan Reddy is happy

Aug 28, 2024 - 20:28
 0
జన్​ ధన్​ @ 10యేళ్లు.. కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బ్యాంకు ఖాతాలు లేని కోట్లాది మందికి ఆర్థిక సహకారం చేకూరుస్తూ ప్రధానమంత్రి జన్​ ధన్​ యోజన (పీఎంజేడీవై) 10యేళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలు లేని భారత్​ ను నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. బుధవారం సామాజిక మాధ్యమం వేదికగా కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 
 
గత పదేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించామన్నారు. 53కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలను సృష్టించగలిగామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, మహిళలు, గ్రామీణ ప్రాంత వాసులకు లబ్ధి చేకూరిందన్నారు. 
 
కేంద్ర పథకాల సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికే అందాలన్నదే తమ లక్ష్యమని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. జీరో బ్యాలెన్స్​ ద్వారా అకౌంట్లు తెరవడమే కాకుండా రూపే డెబిట్​ కార్డులు అందించడంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరం గణనీయంగా తగ్గించామన్ని మంత్రి తెలిపారు.
 
గత పదేళ్లలో దేశ ఆర్థిక పురోగతిలో ఈ ఖాతాల ద్వారా ఆర్థిక లావాదేవీలు కూడా కీలక భూమిక పోషించడం శుభపరిణామమని తెలిపారు. పీఎంజేడీవై ద్వారా తెలంగాణలో వందశాతం మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో 1,19,49,137 అకౌంట్లు తెరవగా.. 86,76,385 రూపే కార్డులు అందజేశామి తెలిపారు. ఈ ఖాతాలలో రూ. 4.389.88 కోట్లు జమ చేశామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.