మొఘలుల దోపిడీపై వీరోచిత పోరాటం

జయంతి రోజున సర్దార్​ సేవలను స్మరించుకున్న కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Aug 18, 2024 - 15:06
 0
మొఘలుల దోపిడీపై వీరోచిత పోరాటం

నా తెలంగాణ, హైదరాబాద్​: మొఘలుల దోపిడీకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాట పటిమను చూపిన మహానీయుడు సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ అని, ఆయన సాహసోపేతమైన పోరాటం, అంచంచలమైన ధైర్యం దేశ చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోతాయని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి కొనియాడారు. ఆదివారం పాపన్న గౌడ్​ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జి.కిషన్​ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ జానపద కథనాయకుడు సర్దార్​ సర్వాయి అని ఆయన సేవలను కొనియాడారు. 

జనగామ జిల్లా రఘునాథపాలెంలో జన్మించిన పాపన్న గౌడ్​ ఆది నుంచే పోరాట పటిమను అలవర్చుకున్నాడు. రాజకీయాలపై చిన్నప్పటి నుంచే అమితాసక్తి. మొఘలులు భూమిశిస్తు పేరుతో రకరకాల పన్నులు వేయటాన్ని సర్దార్​ వ్యతిరేకించాడు. తాటిచెట్లకు కూడా పన్ను వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. అలా మొఘలుల అన్యాయాలపై గళమెత్తి తెలంగాణలో వారి విస్తరణను అడ్డుకున్న తొలివ్యక్తిగా నిలిచాడు. అలా మొఘలులతో పోరాటంలో 1710లో వీరమరణం పొందాడు. ఈయన జీవిత గాథను లండన్​ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిపుణులు అధ్యయనం చేసి పుస్తకాలను కూడా ముద్రించారు.