నా తెలంగాణ, హైదరాబాద్: తెలుగుభాషను పరిరక్షిస్తూ ప్రపంచానికి తెలుగులోని కమ్మదనాన్ని వివరించిన సాహితీ వేత్తలకు, తెలుగు భాషాభిమానులకు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాషా కోవిదుడు గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రపంచంలోని తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుభాషను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మాతృభాషను అందించే లక్ష్యంతో ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కమ్మనైన అమ్మభాష తెలుగుకు వందనమని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి తెలుగు భాషకై చేసిన కృషిని మంత్రి కొనియాడారు.