జమాతే ఇస్లామీపై బంగ్లాలో నిషేధం ఎత్తివేత!
The ban on Jamaat-e-Islami has been lifted in Bangla!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ పార్టీపై నిషేధం ఎత్తివేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఉగ్రవాదం, తీవ్రవాదంపై తీసుకున్న చర్యలపై బుధవారం నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. షేక్ హసీనా వైదొలిగాక 600మంది వరకు ప్రాణాలను కోల్పోయినట్లు యూనైటెడ్స్ నేషన్ ప్రకటించింది. అత్యధికంగా ఇదే సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. 2013 నుంచి ఈ సంస్థ ఎన్నికల్లో పాల్గొనవద్దని యూఎన్ అల్టీమేటం జారీ చేసి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య విధానంలో స్పష్టమైన రోడ్ మ్యాప్ పాటించడం లేదని బీఎన్ పీ (ఆ దేశ ప్రతిపక్ష పార్టీ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సంస్థకు చెందిన చాలామంది ఉగ్రవాదులు భారత్ లో హింసను ప్రేరేపిస్తున్నందుకు అరెస్టు అయ్యారు. ఏబీటీ అల్ ఖైదాకు అనుబంధ సంస్థ.